Kandukur, Sri Potti Sriramulu Nellore | Sep 2, 2025
పోలీస్ దిగ్బంధాలు, ఆంక్షలను ఛేదించుకున్న కరేడు రైతులు bcyనేత బోడె రామచంద్రయాదవ్ను కలిశారు. హైవేపై డిస్టలరీస్ ఫాక్టరీ దగ్గర బోడె రామచంద్ర మజిలీ ఉంటుందని ఊహించిన పోలీసులు ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయితే పోలీసుల కళ్లు కప్పిన రైతులు, రామకృష్ణాపురం గిరిజన కాలనీ మహిళలు బోడెను మంగళవారం ఉదయం 9 గంటల 30 నిమిషాల ప్రాంతంలో కలిశారు. పోలీసు అంచనాలను తలకిందులు చేస్తూ kబిట్రగుంట పెట్రోల్ బంక్ వద్ద కలిసి ఉద్యమానికి మద్దతు కోరారు.