Kavali, Sri Potti Sriramulu Nellore | Aug 28, 2025
రోడ్డు ప్రమాదంలో కావలి మున్సిపాల్టీ బిల్ కలెక్టర్ షేక్ రసూల్ (53) మృతిచెందారు. కావలి జెండా చెట్టు సెంటర్లో ఆయన నివాసం ఉంటున్నారు. మద్దూరుపాడు ఆర్కే డాబా సమీపంలో ఫ్లైఓవర్పైన నడిచి వెళ్తుండగా ఒంగోలు నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఆయనను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడి రసూల్ చనిపోయారు. మృతుడి కుమారుడు అల్తాఫ్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.ఈ ఘటన గురువారం ఉదయం 8 గంటల ప్రాంతంలో జరిగింది.