ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం వేములవాడ పట్టణంలో 5 వార్డు మహాలక్ష్మి విధి,నాంపల్లి, బొజ్జపల్లిలో పలు కుల సంఘ,మహిళ సంఘా భవనాల నిర్మాణనికి స్పెషల్ డేవలెప్మెంట్ ఫండ్స్ నుండి మంజూరు కాబడిన ప్రొసీడింగ్ పత్రాలను ఎమ్మెల్యే అందించారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్యంలో ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కుల సంఘాల నాయకులతో పాటు మహిళా సంఘాల సభ్యులు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు చెబుతూ సన్మానించారు.