రాష్ట్రవ్యాప్తంగా ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని ప్రగతిశీల విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు రాష్టప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కడపలోని వారి కార్యాలయంలో PSU రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిధులుగా పిఎస్యు జాతీయ అధ్యక్షుడు మహమ్మద్ షఫీ ఉల్లా ఆర్ఎస్పీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జానకి రాములు హాజరయ్యారు. సమావేశాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులందరికీ గత 4 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న రియంబర్స్మెంట్ ఇవ్వాలన్నారు.