ఏపీలో మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేయాలని కూటమి నిర్ణయం సరైంది కాదని లండన్ లో ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఖండించారు. ఆదివారం లండన్ లో వైకాపా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తో పాటు దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి పాల్గొని కూటమి నిర్ణయాన్ని వ్యతిరేకించారు. పేదలకు సరైన వైద్యం అందాలంటే ప్రభుత్వం వైద్యశాలలను నిర్వహించాలన్నారు.