ప్రపంచమంతా అంబేద్కర్ గారి విగ్రహాలు పెట్టి గౌరవిస్తూ ఉంటే కరీంనగర్ కిసాన్ నగర్ లో మాత్రం అంబేద్కర్ విగ్రహాన్ని అవమాన పద్దతిలో తొలగించి అంబేద్కర్ అవమానించారని అంబేద్కర్ యూత్ సభ్యులు అశోక్ మండిపడ్డారు. శనివారం మధ్యాహ్నం 2గంటలకు కరీంనగర్ తెలంగాణ చౌక్ లో కరీంనగర్ అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో కిసాన్ నగర్ లో దొంగ చాటుగా తొలగించిన అంబేద్కర్ గారి విగ్రహాన్ని మళ్లీ పునర్నిర్మించాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ యూత్ సభ్యులు రాస్తారోకో చేశారు. అనంతరం అంబేద్కర్ యూత్ సభ్యులు బొడ్డు అశోక్, ఆసంపెళ్లి వినయ్ సాగర్ లు మీడియాతో మాట్లాడారు.