సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మున్సిపల్ కేంద్రంలోని అక్కమ్మ చెరువు మత్తడి దూకుతుంది. అర్ధరాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షంతో చెరువు పూర్తిస్థాయి నీరు చేరుకొని మత్తడి దూకుతుంది. గత వారం కిందనే చెరువు అలుగు పారింది. భారీ వర్షాలతో మరోసారి మత్తడి దూకడంతో స్థానిక రైతాంగం, మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.