Atmakur, Sri Potti Sriramulu Nellore | Aug 30, 2025
మసీదుల ఇమామ్, మౌజన్లకు 9నెలల నుంచి జీతాలు ఇవ్వలేదని.. వారికి వెంటనే జీతాలు ఇవ్వాలంటూ ఆత్మకూరు ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో ఆత్మకూరు ఆర్డీవో కార్యాలయం వద్ద శనివారం ఆందోళన చేశారు. అనంతరం ఆత్మకూరు ఆర్డీవో పావనికి వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. ఆర్డిఓ సానుకూలంగా స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో ఆవాజ్ కమిటీ జిల్లా నాయకుడు యస్దాని, ఇమామ్, మౌజన్లు, తదితరులు పాల్గొన్నారు.