మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఓరుగల్లు ప్రజల ఇలవేల్ పైన భద్రకాళి అమ్మవారిని బిజెపి తెలంగాణ రాష్ట్ర నాయకురాలు మాధవి లత దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా గోశాలలో గోవులకు గడ్డి తినిపించి వల్లభ గణపతిని దర్శించుకుని అనంతరం భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమెకు తీర్థ ప్రసాదాలను అందించారు ఆలయ అర్చకులు. అనంతరం మాధవి లత మాట్లాడుతూ భద్రకాళి అమ్మ వారిని దర్శించుకోవడం తన పూర్వజన్మ సుకృతం అని అన్నారు.