కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలో ఇసుక ట్రాక్టర్ల డ్రైవర్లు, మితి మీరిన వేగంతో, అధిక లోడుతో తరలిస్తున్న సమయంలో ఇసుక అంతా రోడ్లపై పడి ఇతర వాహనదారులను ఇబ్బందులకు గురవుతున్నారు. శనివారం జమ్మలమడుగు మున్సిపాలిటీ కమీషనర్ వెంకట్రామిరెడ్డి పట్టణ రోడ్లపై అధిక లోడుతో వెళ్తున్న ఇసుక ట్రాక్టర్ను ఆపారు. డ్రైవర్ను మందలిస్తూ యజమానిని పిలిపించి ఇలాగే కొనసాగితే ట్రాక్టర్ను సీజ్ చేస్తామని కమిషనర్ వెంకట్రామి రెడ్డి హెచ్చరించారు.