కళ్యాణదుర్గం కు చెందిన నామాల బేబీ ప్రియాంక అనంతపురం జిల్లా వైసీపీ అధికార ప్రతినిధిగా ఎంపికయ్యారు. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా జిల్లా అధికార ప్రతినిధిగా ఎంపికైన నామాల బేబీ ప్రియాంక మాట్లాడారు. పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తానన్నారు. పదవిని బాధ్యతగా భావిస్తానన్నారు.తనపై నమ్మకంతో ఇంత పెద్ద పదవిని ఇచ్చిన వైసీపీ అధినేత వైఎస్ జగన్కు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు.