భీమవరం నియోజకవర్గం తెలుగుదేశంపార్టీ నాయకులకు లభించిన నామినేటెడ్ మరియు పార్టీ పదవులు వారి కష్టానికి ప్రతిఫలమని టిడిపి రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాస్ తెలిపారు. భీమవరం పట్టణంలో శ్రీనివాస్ ఇంటి వద్ద నిర్వహించిన కార్యక్రమములో శ్రీనివాస్ మాట్లాడుతూ నూతనముగా పదవులు లభించిన వారందరూ తమ పదవులకు న్యాయం చేకూర్చి ఎన్డీఏ కూటమి ప్రభుత్వనికి, పార్టీనకు మంచిపేరు తేవాలన్నారు.నూతన పదవులు లభించిన కూటమి నాయకులను శాలువాలతో సత్కరించి అభినందించారు. భీమవరం పట్టణ టిడిపి అధ్యక్ష కార్యదర్శులు మద్ధుల రాము, చెల్లబోయిన గోవింద్, టిడిపి నాయకులు పాల్గొన్నారు.