మంచిర్యాల పట్టణంలోని ముత్తూట్ ఫైనాన్స్ (ఫిన్ కార్ప్) ఎదుట చెన్నూరు sbi ఖాతాదారులు ఆందోళన చేపట్టారు.చెన్నూరు ఎస్బిఐ బ్యాంకులో తనాఖా ఉన్న బంగారం తమ అనుమతి లేకుండా మంచిర్యాల ముత్తూట్ ఫైనాన్స్ (ఫిన్ కార్ప్)లో ఎలా ఉంటుందని ఖాతాదారులు శనివారం సాయంత్రం ఆగ్రహం వ్యక్తం చేశారు.అన్ని బ్యాంకులు,ఫైనాన్సు లు ఖాతాదారులకు సహకరిస్తున్నాయని,ఒక ముత్తూట్ ఫైనాన్స్ మాత్రమే ఎందుకు సహకరించడం లేదని ముత్తూట్ ఫైనాన్స్ నిర్వాహకులపై మండిపడ్డారు.రెండు రోజుల్లో తమ బంగారాన్ని రసీదులు లేకుండా ఇవ్వాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో ముత్తూట్ ఫైనాన్స్ లేకుండా చేస్తామని హెచ్చరించారు.ఖాతాదారులు ఆందోళన చేపట్టరు