అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని పాపంపేట వద్ద అడ్వకేట్ సత్యనారాయణ రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా అడ్వకేట్ సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ అనంతపురం నగరంలో సాయి నగర్ లో 10 కోట్ల రూపాయల విలువైన పావని ఆసుపత్రిని ముగ్గురు భాగస్తులు అయిన శ్రీనివాసులు రాఘవేంద్ర శ్రీలతలతో కలిసి కొనుగోలు చేయడం జరిగిందని, అయితే డాక్టర్ రాఘవేంద్ర శ్రీలత ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టకుండా మోసాలకు పాల్పడుతున్నారని పాపంపేట వద్ద అడ్వకేట్ సత్యనారాయణరెడ్డి మీడియాకు వివరాలను వెల్లడించారు.