కరీంనగర్ జిల్లా,చొప్పదండి మండలం,వెదురుగట్ట గ్రామానికి చెందిన గర్వంద దీప్తిక(12) అనే బాలిక శుక్రవారం పాముకాటుకు గురై మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది,7 వ తరగతి చదువుతున్న దీప్తిక కిరాణా షాప్ లో ఉండగా విష సర్పం తన కుడికాలు మడిమపై కాటు వేసింది,దీంతో బాలిక కేకలు వేస్తూ కుటుంబ సభ్యులకు తెలిపింది,కుటుంబ సభ్యులు వెంటనే నగునూరులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు, చికిత్స పొందుతున్న దీప్తిక 5:50 PM కి మృతి చెందింది, బాలిక కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు, ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది,ఇంకా ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది,