పరిశ్రమల్లో ప్రమాదాలు జరగకుండా భద్రతా చర్యలను మరింత పటిష్టం చేయాలని... జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాల్ నందు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధ్యక్షతన జిల్లా క్రైసిస్ గ్రూప్ కమిటీ సమావేశం జరిగింది.