ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గ్రూప్-1 పరీక్షలను మరోసారి నిర్వహించాలని బీఆర్ఎస్వీ కో ఆర్డినేటర్ రాజేందర్ నాయక్ డిమాండ్ చేశారు. సంగారెడ్డిలో గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క గ్రూప్-1 పరీక్ష కూడా సరిగా నిర్వహించలేదని విమర్శించారు.రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.