కరీంనగర్ నగరంలో రెండు నెలలు ప్రత్యేక శిక్షణ ఇచ్చి లైసెన్స్ పొందిన 15 మంది మహిళలకు ఉచిత ఎలక్ట్రికల్ ఆటోలను బుధవారం కేంద్ర మంత్రి బండి సంజయ్ అందజేశారు. పీజీ, బీటెక్ చేసిన మహిళలు స్వయం ఉపాధి కోసం ఆటోలు నడిపేందుకు సిద్ధపడడం సంతోషంగా ఉందన్నారు. మహిళల చేతికి తాళం చెవి ఇస్తేనే ఆ ఇల్లు బాగుపడుతుందని, అందుకే మోడీ దేశ బడ్జెట్ ను నిర్మల సీతారామన్ చేతిలో పెట్టారని అన్నారు. జిల్లా కలెక్టర్ పమేల సత్పతి చొరవతో మహిళలు ప్రత్యేకంగా డ్రైవింగ్ శిక్షణ పొంది లైసెన్స్ పొందారని తెలిపారు. మహిళలతో కలిసి ఆటోలో ప్రయాణం చేశారు.