ఏటూరునాగారంలో మైనారిటీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి మంత్రి సీతక్క చొరవతో రూ.1.5 కోట్ల మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు ముస్తఫా ఆధ్వర్యంలో సీతక్క, సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..మైనార్టీల అభివృద్ధికి కృషి చేస్తున్న సీతక్కకు ముస్లిం మత పెద్దలు కృతజ్ఞతలు తెలిపారన్నారు.