కామారెడ్డి జిల్లాలో 5 రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని కావున జిల్లాలోని ప్రజలు అప్రమత్తంగా ఉండి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ గురువారం సూచించారు. జిల్లాలో నేటి నుండి 5 రోజుల వరకు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ సమాచారం అందించిందని వాతావరణం శాఖ సూచనల మేరకు ఇప్పటికే జిల్లాలో అధిక వర్షాల వలన కలిగిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని అధిక వర్షపాతం కురిస్తే గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకుఎప్పటికప్పుడు జిల్లా స్థాయిలో తెలియజేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.