అంగన్వాడీ ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ దేశవ్యాప్త నిరసనలో భాగంగా ముమ్మిడివరం లో అంగన్వాడీ వర్కర్లు బ్లాక్ డే నిరసన కార్యక్రమం చేపట్టారు. స్థానిక తాసిల్దార్ కార్యాలయం వద్ద సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నినాదాలు చేశారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్ మాట్లాడుతూ పెరిగిన నిత్యవసర ధరలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీల జీతాలు పెంచాలన్నారు. కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు