బుధవారం జిల్లా కలెక్టరేట్ జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నుండి వివిధ రెవెన్యూ అంశాలపై జిల్లాలోని రెవెన్యూ డివిజన్ అధికారులు, తాహసిల్దారులతో జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో రీ సర్వే పూర్తి అయిన గ్రామాలకు సంబంధించి ప్రభుత్వం నుండి వచ్చిన పట్టాదార్ పాస్ పుస్తకములను తనిఖీ చేసి ఫోటోలు మరియు తప్పులు ఉన్న పాస్ పుస్తకములను సవరించి పంపిణీ చేయుటకు సిద్ధం చేయాలని జిల్లాలోని తాహసిల్దార్ల ను జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు.