ప్రభుత్వంపై పెన్షన్ దారులు తాడో పేడో తెలుసుకునేందుకు సెప్టెంబర్ 9న ఛలో హైదరాబాద్ కార్యక్రమంకు లక్షల మంది తరలిరావాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ అవార్డు గ్రహీత,మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు.రాయికల్ మండల కేంద్రంలో ఒక ఫంక్షన్హాల్లో జరిగిన వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, చేయూత పెన్షన్ దారుల సన్నాహక సదస్సుకు ముఖ్య అతిథిగా మంద కృష్ణ మాదిగ హాజరయ్యారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ.... వికలాంగులకు 6 వేలు, సమస్త చేయుత పెన్షన్ దారులకు 4000 రూపాయలు సెప్టెంబర్ 8 లోపే పెంచాలని డిమాండ్ చేశారు. సెప్టెంబరు 9న హైదరాబాద్ చేరుకొని ప్రభుత్వంను నిలదీస్తామని అన్నారు.