కామారెడ్డి జిల్లాలోని బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లకు కొత్త మొబైల్స్ మంత్ర ఫింగర్ ప్రింట్ సెట్ను సోమవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాకు మొత్తం 211 సెట్స్ వచ్చాయని తెలిపారు. వీటిని ఉపయోగించి ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ద్వారా పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఎవరికైనా ఫేస్ రికగ్నైజేషన్ రాకపోతే మంత్ర డివైస్ ఫింగర్ ప్రింట్ ద్వారా పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. వీటి ద్వారా పెన్షన్ పంపిణీ నేరుగా లబ్ధిదారులకు చేరుతుందని, చాలా తక్కువ సమయంలో ఎక్కువ పెన్షన్లు పంపిణీ చేయడానికి అవకాశం ఉంటుందన్నారు.