కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారీ వర్షాల కారణంగా జరిగిన నష్టాలకు నివేదిక రూపొందించి గురువారం సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో వివరించడం జరిగిందని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి తెలిపారు. వరద బాధితులు, ముంపునకు గురైన పంటల నష్టం, భారీ బీభత్సం సృష్టించిన వర్షాలకు కొట్టుకుపోయిన ప్రధాన రహదారులు, కూలిన బ్రిడ్జిలు, వంటి సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లాలని తెలిపారు. పారిశుద్ధ్య కార్మికుల నుండి మొదలుకొని పోలీసులు, శానిటేషన్ వారు రాత్రింబవళ్లు ప్రాణ నష్టం జరగకుండా చూసామన్నారు. ప్రజల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు సీఎం జిల్లాలో పర్యటించడం చాలా సంతోషంగా ఉందన్నారు.