గుత్తి ఆర్ఎస్ లోని బీసీ కాలనీలో ప్రమాదవశాత్తు రంపం కోసుకుని ఖాసీం వలి అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఖాసీం వలి ఇంటిపై రేకులు వేసి వాటిని రంపంతో కోస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కడుపుకు రంపం కోసుకుంది. దీంతో తీవ్రంగా గాయపడ్డాడు. రక్తస్రావం జరిగింది. కుటుంబ సభ్యులు వెంటనే గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు కడుపుకు ఆరు కుట్లు వేశారు. అనంతరం మెరుగైన వైద్యం కొరకు అనంతపురం రెఫర్ చేశారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.