ప్రభుత్వం దృష్టికి ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సమస్యలు, డిమాండ్లను తీసుకుపోయి పరిష్కరిస్తా అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ నగరం లోని ఆల్మాస్ ఫంక్షన్ హాలు లో జరిగిన ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం మహా వేదిక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన లో మీ పాత్ర చాలా ప్రధానమైనదని, నిజమైన ఉద్యమకారులు మేరే అని ఆయన చెప్పారు. మీరు చేసిన పోరాటం వలననే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడిందని, ప్రతి ఒక్కరిని తెలంగాణ రాష్ట్ర సాధన లో భాగస్వామ్యం చేసిందన్నారు. నాడు మీరు చేసిన పోరాటం వలననే దేశవ్యాప్త