పలమనేరు: పట్టణం డిఎస్పి కార్యాలయ వర్గాలు సోమవారం తెలిపిన సమాచారం మేరకు. రానున్న వినాయక చవితి పండుగ నేపథ్యంలో, గతేడాది ఇదే పండుగ రోజు గొడవలు పడ్డ రామకృష్ణ, చైతన్య, బాలాజీ, రాజు, సురేంద్రబాబు లను డీఎస్పీ కార్యాలయంలో డిఎస్పీ డేగల ప్రభాకర్ ఎదుట హాజరు పరిచి కౌన్సిలింగ్ ఇచ్చామన్నారు. అనంతరం వీరిని తహసిల్దార్ ఎదుట బైండోవర్ చేసామన్నారు, వినాయక చవితి సందర్భంగా ఎవరైనా గొడవలు పడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.