టీడీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్చార్జ్ మరియు రాష్ట్ర భవన కార్మికుల మరియు ఇతర వ్యవహారాల చైర్మన్ వలవల బాబ్జి ఆధ్వర్యంలో టిడిపి నాయకుల సమావేశం ఆదివారం సాయంత్రం 6 గంటలకు జరిగింది. ఈ సమావేశంలో పెంటపాడు మండలం, తాడేపల్లిగూడెం టౌన్, నూతన గ్రామ కమిటీలు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇంచార్జ్‌లను నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అబ్సర్వర్ చుక్కా సాయిబాబు, నక్క చిట్టిబాబు, మండల నాయకుల సమక్షంలో ప్రధాన కమిటీ కార్యవర్గాన్ని ప్రకటించడం జరిగింది.