అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే జీఆర్పీ సర్కిల్ పరిధిలోని బెవనహళ్-టి.సాకిబండ రైల్వే స్టేషన్ ల మధ్య కిలో మీటర్ 236/29 వద్ద రైలు కింద పడి గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందాడు. ఎస్ఐ మహేంద్ర తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బెవనహళ్ సమీపంలో గుర్తు తెలియని మృతదేహం ఉందని సమాచారం అందింది. సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించగా ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. మృతుడికి సుమారు 55 నుంచి 60 ఏళ్లు ఉంటాయని ఎవరైనా గుర్తు పడితే 9866144616 కు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ మహేంద్ర కోరారు.