వైఎస్ఆర్ కడప జిల్లా ఖాజీపేటలోని ఓ పెట్రోల్ బంకు మోసం బట్టబయలైంది. పొద్దు ద్విచక్ర వాహనదారుడు శనివారము పెట్రోల్ బంకు వద్దకు వెళ్లి వంద రూపాయలు పెట్రోల్ పట్టించుకుంటే కనీసం 30 రూపాయల పెట్రోల్ కూడా రాలేదని ఆరోపించారు. దీంతో ఓ బాటిల్లో పెట్రోల్ పట్టించుకుని చూపించారు. ఇంతటి మోసం చేస్తున్న పెట్రోల్ బంకు యాజమాన్యంపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. జిల్లాలో పలుచోట్ల మోసాలు ఇలా వెలుగులోకి వస్తున్నాయన్నారు. ఇప్పటికైనా అధికారులు నిమ్మకు నీరు ఎత్తినట్లు ఉండకుండా స్పందించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.