గుంటూరు నగరంలోని బుడంపాడు బైపాస్లోని అన్నపూర్ణ కమర్షియల్ కాంప్లెక్స్లో కొల్లిశారదా మార్కెట్ పాత వ్యాపారులు వ్యాపారం చేస్తారని కొల్లిశారదా మార్కెట్ అధ్యక్షుడు సత్యనారాయణ స్పష్టం చేశారు. తమ వ్యాపారాలకు కమిషనర్ ఇబ్బందులు కలిగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్డంకులు కలిగిస్తే ఆమరణ నిరాహార దీక్షకైనా సిద్దమని స్పష్టం చేశారు. కొల్లిశారదాలో దుకాణాలు దక్కించుకున్న వారి కోసం కమిషనర్ పనిచేస్తున్నారని విమర్శించారు.