హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఆన్లైన్ ట్రేడింగ్ మోసానికి పాల్పడిన గురుగావ్కు చెందిన వ్యాపారవేత్త వినీత్ ఛాదా (58)ను అరెస్టు చేశారు. బాధితుడి నుంచి రూ. 2.02 కోట్లు దోచుకోవడానికి ఛాదా సహకరించాడు. వివిధ అకౌంట్లకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి కమిషన్ తీసుకునేవాడు. ఈ కేసులో ఇంతకుముందే ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశామని వెల్లడించారు. మోసపూరిత ట్రేడింగ్ యాప్ల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు.