చింతకొమ్మదిన్నె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన స్మార్ట్ కిచెన్ విధానాన్ని రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలులో భాగంగా స్మార్ట్ కిచెన్‌లు ఉపయోగించి చేపడుతున్న వంటల తయారీ, నాణ్యత, శుభ్రత, యాప్ ద్వారా పర్యవేక్షణ వంటి అంశాలపై జిల్లా కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ మంత్రి గారికి సమగ్రమైన వివరాలు అందించారు. మంత్రి లోకేశ్ ఈ వినూత్న విధానాన్ని అభినందిస్తూ, “స్మార్ట్ కిచెన్ ద్వారా భోజనం తయారీ పద్ధతులు అభినందనీయమైనవే. ఆహారం రుచి బ్రహ్మాండంగా ఉంది” అంటూ ప్రశంసించారు.