కనిగిరి: సెప్టెంబర్ 13న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని కనిగిరి జూనియర్ సివిల్ జడ్జి రూపశ్రీ తెలిపారు.మంగళవారం కోర్టు పరిధిలో ఉన్న న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. జడ్జి మాట్లాడుతూ.. రాజీ మార్గమే రాజమార్గమని అన్నారు. కక్షిదారులు రాజీమార్గం ద్వారా కేసులు పరిష్కరించుకునేటట్లు చూడాలని న్యాయవాదులకు సూచించారు.కక్షి దారులకు లోక్ అదాలత్ పై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలన్నారు.