పి.గన్నవరం మండలం, జొన్నలంకకు చెందిన పెసింగి సాయిబాబు అనే వ్యక్తి శనివారం పి.గన్నవరం వద్ద ఉన్న హై-టెన్షన్ విద్యుత్ టవర్ ఎక్కాడు. భార్యాభర్తల మధ్య స్వల్ప వివాదం కారణంగా సాయిబాబు భార్యను ఆమె బంధువులు పుట్టింటికి తీసుకెళ్లారని, ఆమెను తిరిగి పంపించాలని డిమాండ్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, అతనికి నచ్చజెప్పి సురక్షితంగా కిందకు దించారు.