అనంతపురం జిల్లా గుత్తి మండల పరిధిలోని వన్నెదొడ్డి గ్రామ శివారులో ఉన్న ఎన్టీపీసీ పవర్ గ్రిడ్ లో వాటర్ బాటిల్ మూత మింగి రక్షత్ రామ్ అనే చిన్నారి బాలుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం నగరానికి చెందిన మౌనిక ఎన్టీపీసీ లో ఏపీ ట్రాన్స్ కోలో ఏడీఈ గా విధులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి నైట్ షిఫ్ట్ డ్యూటీ కి వచ్చింది. చిన్నారికి వాటర్ బాటిల్ ఇచ్చి విధుల్లో నిమగ్నమైంది. అయితే బాలుడు బాటిల్ మూత తీసి మింగి అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే గుత్తి ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు తెలిపారు.