Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 31, 2025
భూపాలపల్లి నియోజకవర్గంలోని టేకుమట్ల మండలం సోమన్ పల్లి గ్రామంలో ఆదివారం ఉదయం 11 గంటలకు యాదవ కులస్తులు,గొర్రె కాపరులను కలుసుకొని వారి సమస్యలు అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు మల్లేష్.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలం నేపథ్యంలో పశువులకు సీజనల్ వ్యాధులు సంక్రమించి చనిపోయే ప్రమాదం ఉందని, కావున ప్రభుత్వం వెంటనే స్పందించి పశువుల ఆసుపత్రి ద్వారా గొర్రెలకు, మేకలకు నట్టల నివారణ మందులు నిమోనియా టీకాలు అందించే ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు సిపిఐ ఎంఎల్ లిబరేషన్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్.