కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు 0నుంచి 40సంవత్సరాల వయసు కలిగిన ఆదివాసీ ప్రజలందరూ సికిల్ సెల్ అనీమియా పరీక్షలు చేయించుకోవాలని అల్లూరి సీతారామరాజు జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్ అన్నారు. బుధవారం మధ్యాహ్నం పాడేరులో డివిజన్ పరిధిలోని 35 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులకు శిక్షణ నిర్వహించారు. సికిల్ సెల్ అనీమియా వ్యాధి గురించి, మాతా శిశువులకు అందిస్తున్న వ్యాధి నిరోధక టీకాల గురించి శిక్షణ తరగతులు నిర్వహించారు.