భారతీయ కిసాన్ సంఘం కామారెడ్డి జిల్లా సమావేశం బృందావన్ గార్డెన్ కామారెడ్డిలో మంగళవారం 200 మంది కార్యకర్తలతో సమావేశం జరిగిందని జిల్లా అధ్యక్షులు విట్టల్ రెడ్డి తెలిపారు. రైతు సమస్యలపై అనగా భారీ వర్షాల కారణంగా పంట నష్టం జరిగిన రైతులకు ఎకరానికి రూ. 30 వేల రూపాయలు నష్టపరిహారం ఇప్పించాలని, యూరియా కొరత ఉన్నందున వెంటనే యూరియా రైతులకు సరిపడా అందించాలని, సోయాబీన్ కొనుగోలు కేంద్రాలు పంట చేతికి రాగానే అనగా అక్టోబర్ మొదటి వారంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని ఈ సందర్భంగా కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని భారతీయ కిసాన్ సంఘం జిల్లా అధ్యక్షులు విట్టల్ రెడ్డి తెలిపారు.