యాదాద్రి భువనగిరి జిల్లా, గుండాల మండల పరిధిలోని సీతారాంపురం గ్రామంలో మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు రిజిస్ట్రేషన్ ప్రక్రియను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పట్టాదారు పాసు బుక్ కలిగిన ప్రతి రైతు తమ తమ గ్రామాలకు అనుబంధంగా ఉన్న రైతు వేదికల వద్ద తమ పేరు నమోదు చేసుకోవాలని కోరారు. నమోదు చేసుకున్న వారికి కిసాన్ కార్డు వస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అందించే పథకాలు రైతులకు నేరుగా చేరాలని ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.