శారీరక దృఢత్వం, సంపూర్ణ ఆరోగ్యానికి సైక్లింగ్ ఎంతో దోహదపడుతుందని జిల్లా ఎస్.పి శ్రీ ఇ.జి అశోక్ కుమార్ ఐ.పి.ఎస్ గారు పేర్కొన్నారు. ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వుల మేరకు నగర శివార్లలోని ఊటుకూరు సర్కిల్ నుండి మాంట్ ఫోర్ట్ స్కూల్ వరకూ 6 కి.మీ నిర్వహించిన సైకిల్ ర్యాలీ ని జిల్లా ఎస్.పి గారు ప్రారంభించారు. స్వయంగా పాల్గొని పోలీస్ అధికారులు, సిబ్బంది లో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్.పి గారు మాట్లాడుతూ సైక్లింగ్ సహజసిద్ధమైన వ్యాయామమని తెలిపారు.