వెలిగండ్ల మండలంలోని గన్నవరం బ్రిడ్జి నిర్మాణాన్ని కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గత వైసిపి ప్రభుత్వం లో గన్నవరం బ్రిడ్జి నిర్మాణ పనులను నిర్లక్ష్యం చేసిందన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బ్రిడ్జి నిర్మాణానికి నిధులు రాబట్టి, పూర్తి చేశామన్నారు. బ్రిడ్జి నిర్మాణంతో గన్నవరం గ్రామస్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా రాకపోకలు సాగుతాయి అన్నారు. త్వరలోనే బ్రిడ్జిని ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.