చిత్తూరు జిల్లా .పుంగనూరు నియోజకవర్గం .చౌడేపల్లి మండలం దుర్గ సముద్రం వద్ద చౌడేపల్లి నుంచి రాయలపేటకు బుధవారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో వెళుతున్న ఆటో డ్రైవర్ విశ్వనాథ్ కు ఫిట్స్ రావడంతో ఆటో అదుపుతప్పి నివాస గృహాల్లో దూసుకెళ్లింది . ప్రమాదంలో గాయపడ్డ వారిని స్థానిక ప్రభుత్వాసుపత్రి తరలించారు ఘటనపై చౌడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది