గుడ్లూరు మండలం గుండ్లపాలెం గ్రామ సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దారిలో వెళ్తున్న బైక్ను కారు ఢీకొట్టిందని స్థానికులు చెబుతున్నారు. ఈ యాక్సిడెంట్లో ముగ్గురు తీవ్ర గాయాలపాలవ్వగా, మరొకరు అక్కడిక్కడే మృతి చెందారు. క్షతగాత్రులను ఒంగోలు రిము తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటన గురువారం సాయంత్రం 3 గంటలకు జరిగింది.