కామారెడ్డి : రాజకీయ మైలేజ్ కోసమే విద్యారంగంలో రేవంత్ రెడ్డి కొత్త హామీలు ఇస్తున్నారని పిడియస్యూ జిల్లా అధ్యక్షులు , జి సురేష్ విమర్శించారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) కామారెడ్డి కమిటీ ముఖ్య నాయకుల సమావేశం స్థానిక కార్యాలయంలో నిర్వహించడం జరిగింది.జిల్లా అధ్యక్షులు జి సురేష్ మాట్లాడుతూ ఫీజుల నియంత్రణ చట్టం లేకపోవడం వలన ప్రైవేటు,కార్పొరేట్ విద్యాసంస్థల్లో లక్షల రూపాయల వసూలు చేస్తున్నారని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలు, కళాశాలలను నడిపిస్తున్న ,ఫీజులు దోపిడీ చేస్తున్న ప్రభుత్వాలు అడ్డుకట్ట వేయకపోవడం లేదన్నారు.