బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కురిసిన భారీ వర్షాల కారణంగా సాలూరు నియోజకవర్గంలోని మెంటాడ మండల పరిధిలో కోనేటి గెడ్డకు గండి పడింది. దీంతో బడేవలస గ్రామ సమీపంలో గెడ్డలోని నీరు, పొలాలలోకి చేరింది. సుమారు 100 ఎకరాల వరి పొలాలు ముంపుకు గురయ్యాయి. అలాగే పొలాల్లో ఇసుక మేటలు వేసాయన్న విషయం తెలుసుకున్న మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర బుధవారం వైసీపీ నాయకులతో కలిసి పరిశీలించారు. మదుపులు పెట్టి, వరి నాట్లు వేశామని, ఇంతలో ఇలా జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని రాజన్నదొర డిమాండ్ చేశారు.