దగదర్తి - రాచర్లపాడు ఛానల్ పనులను నాసిరకంగా నిర్మిస్తూ పాత ప్రతిపాదలను తుంగలో తొక్కి, కొత్తగా ప్రతిపాదనలను మార్చి రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం కావలిలోని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నందు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ను కలిసి విషయాన్ని సవివరంగా వివరించారు. అనంతరం మెమోరాండం సమర్పించారు. ఈ కార్యక్రమం సోమవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో జరిగింది.