అనకాపల్లి జిల్లా చోడవరం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోగల చోడవరం మండలం, అడ్డూరు గ్రామం సమీపంలోని బుధవారం నాడు రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. అక్కడికక్కడే ఆటో డ్రైవర్ మృతిచెందిగా మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి కొందరిని, మరికొందరిని చోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.