ఆత్మకూరు మండలం, ముష్టపల్లె గ్రామానికి చెందిన కౌలు రైతు శివాజీ నాయక్ కు చెందిన వ్యవసాయ మోటార్ ను ఇద్దరు వ్యక్తులు అపహరించుకొనిబైక్ పై తీసుకెళ్తుండగా వెంబడించి దొంగలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని పోలీసులకు అప్పగించాడు. సిద్దాపురం చెరువు నుంచి కరివేనకు వెళ్లే నీటి కాల్వకు మోటర్ బిగించుకొని శివాజి నాయక్ పంటకు నీళ్లు కట్టుకుంటూ వుంటాడు. ఇప్పటికే రెండు మోటర్లను దొంగిలించడంతో... తరచూ పొలం దగ్గరకు వచ్చి వెళ్తూ..వారి కదలికలు గమనిస్తూ అప్రమత్తంగా వున్నాడు.అయినా సరే దొంగలు శివాజీ నాయక్ కళ్ళు కప్పి మోటార్ ను అపహరించుకొని వెళ్తున్న సమయంలో శివాజీ నాయక్ వారిని గుర్తించాడు.